పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించింది. ‘రాధేశ్యామ్’ విడుదల విషయంలో వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని జనవరి 14న సినిమా విడుదలై తీరుతుందని స్పష్టం చేసింది. . దీంతో పాటు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసింది యూవీ క్రియేషన్స్. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ ఇందులో హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు.