
Sankranthiki Vasthunam collections:
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన Sankranthiki Vasthunam సినిమాకు అమెరికాలో అద్భుతమైన స్పందన వచ్చింది. కేవలం 7 రోజుల్లోనే $2 మిలియన్ కలెక్షన్ సాధించడం విశేషం. అయితే, ఈ సక్సెస్ వెనుక ఓ స్మార్ట్ మేనేజ్‌మెంట్ ఉంది అని టాక్.
అమెరికాలో శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ స్ట్రాటజిక్‌గా టికెట్ రేట్లను $10–$12కు తగ్గించింది. ఈ నిర్ణయం కుటుంబాలను థియేటర్‌కు ఆకర్షించింది. ఇటీవల పాన్-ఇండియా సినిమాలు, చిన్న సినిమాల పాపులారిటీతో టికెట్ ధరలు పెరగడంతో, థియేటర్లకు ఎక్కువగా స్టూడెంట్లు, బ్యాచిలర్స్ మాత్రమే వస్తున్నారు. కానీ, ఇప్పుడు తక్కువ ధరల కారణంగా కుటుంబ సభ్యులు కూడా థియేటర్‌కు వెళ్లేలా జరిగింది.
వెంకటేశ్ వంటి స్టార్ హీరో ఉన్నప్పుడు టికెట్ రేట్లు ఎక్కువగా పెంచడానికి ఆశ పడవచ్చు. కానీ ష్లోక సంస్థ ఇదే విషయంలో గ్రీడీగా కాకుండా వ్యూయర్ ఫ్రెండ్లీగా వ్యవహరించింది. ఈ నిర్ణయంతో సినిమా పాజిటివ్ టాక్‌తో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. అందుకే, ప్రేక్షకులు OTT రిలీజ్ కోసం ఎదురుచూడకుండా థియేటర్‌కు వచ్చారు.
అంతేకాక, భారతదేశంలో పాజిటివ్ టాక్‌తో అక్కడి వసూళ్లు కూడా సినిమా క్రేజ్‌ను పెంచాయి. భారీ మంచు పతనం, మొదటి స్నోస్టార్మ్ వంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నప్పటికీ, ఆదివారం రోజున ఈ చిత్రం $300K దక్కించుకుంది. సోమవారం నాడు సెలవు కావడంతో, వీకెండ్ కలెక్షన్లు ఇంకా బాగుంటాయని అంచనా.
ఇలాంటి వ్యూయర్-ఫ్రెండ్లీ స్ట్రాటజీలు ఇతర డిస్ట్రిబ్యూటర్లు కూడా పాటిస్తే, మరిన్ని సినిమాలు అమెరికాలో మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ఈ టికెట్ రేట్ల ప్లాన్ మెయిన్ ఫ్యాక్టర్ అయ్యిందని చెప్పవచ్చు.