అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. అచ్చు రాజమణి – అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో, సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రధానమైన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల కానుంది.