బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా కరోనాపై పోరుకు తనవంతు సహాయంగా రూ. 5 కోట్లు ప్రకటించింది. కేవలం తన గ్లామర్ తోనే కాకుండా.. మంచి మనసుతోను ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశికి 1.8 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫాలోవర్స్ సహకారంతో ఈమె ఓ డ్యాన్ క్లాస్‌ని నిర్వహించింది. దాంతో ఆమెకు వారి నుంచి భారీగా డొనేషన్స్ అందాయి. విపత్కర పరిస్తితుల్లో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. 2.5 కోట్ల మంది ఫాలోవర్స్‌లో 1.8 కోట్ల మంది డ్యాన్స్ క్లాస్‌లో పాల్గొన్నారు. వారి సహకారంతో రూ. 5 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిపింది. ఈ సాయం చిన్నదే కావచ్చుకానీ మా వంతు ప్రయత్నం వృథా కాలేదు అంది. కరోనాపై
పోరాటానికి అందరి సహాయం అవసరమని ఊర్వశి రౌటేలా తెలిపింది.