బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ‘ఊర్మిళ శృంగార తార’ అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు నటన రాదని, కేవలం శృంగార తారగా మాత్రమే గుర్తింపు పొందింది అని విమర్శించింది. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు, పలువురు నెటిజన్లు కంగనకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా తనవైపు నిలిచిన వారికి ఊర్మిళ ధన్యవాదాలు తెలిపారు. ‘నాకు మద్దతు తెలిపిన ‘రియల్ పీపుల్ ఆఫ్ ఇండియా’కు.. పక్షపాతంలేని, గౌరవ ప్రదమైన మీడియాకు ధన్యవాదాలు. తప్పుడు విమర్శలు, ప్రచారానికి వ్యతిరేకంగా ఇది మీరు సాధించిన విజయం. మీ అభిమానం, ప్రేమ నా మనసును తాకాయి. జై హింద్’ అని ఆమె ట్వీట్ చేశారు.
సుశాంత్ మరణం తర్వాత కంగనా బాలీవుడ్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో డ్రగ్స్ కోణం బయటపడంతో ఆమె వ్యాఖ్యలు తీవ్రరూపం దాల్చాయి. మరోపక్క ముంబయి ప్రభుత్వం, శివసేన పార్టీ నాయకులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనను ఉద్దేశిస్తూ ఊర్మిళ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘బీజేపీ టికెట్ పొందేందుకే కంగన ఈ విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి నగరం గురించి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు’ అని చెప్పారు. దీనిపై కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఊర్మిళ కామెంట్లు నా పోరాటాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి. బీజేపీ టికెట్ పొందడం కోసమే నేను ఈ విధంగా పోరాటం చేస్తున్నానని ఆమె నాపై ఆరోపణలు చేశారు. నటన వల్ల కాకుండా ఓ శృంగార తారగా మాత్రమే ఆమె ప్రజలకు సుపరిచితురాలైంది. అలాంటిది ఆమే టికెట్ పొందగలిగితే.. నేను ఎందుకు పొందలేను’ అని వ్యాఖ్యానించారు.
Thank you the “Real People of India” and a rare breed of unbiased,dignified media for standing by me. It’s Your victory over fake IT trolls n propaganda.
Deeply touched..humbled 🙏🏼#JaiHind— Urmila Matondkar (@UrmilaMatondkar) September 18, 2020