నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం జగన్ రెడ్డిని మానసికంగా బాగా బాధిస్తోంది. దాంతో ఆ వేదన నుండి జగన్ రెడ్డిని బయట పడేయటానికి వైసీపీ మీడియా చేయని ప్రయత్నం లేదు. కోటంరెడ్డి డ్రామాలాడుతున్నారని, ఆయన అవాస్తవాలు చెబుతున్నాడని ప్రచారం చేశారు. అయినా వర్కౌట్ కావడం లేదు. కోటంరెడ్డి వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ రెడ్డి బ్యాచ్ పై విరుచుకుపడుతున్నారు. అందుకే, వైసీపీ మీడియా కొత్త రాగం అందుకుంది. అర్జెంట్ గా జగన్ రెడ్డికి ప్రశాంతతను ఇవ్వాలి. అందుకే, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు వైసీపీలో చేరతాడనే ప్రచారాన్ని మొదలుపెట్టారు.
యనమల రామకృష్ణుడి కుటుంబం టీడీపీకి దూరం అవుతుంది అంటే.. సగటు ఆంధ్రుడు నమ్ముతాడా ?, కూలీ మీడియాకి ఈ మాత్రం తెలియదా ?, పైగా ఈ విషయం పై పెద్ద పెద్ద కథనాలు వండి వార్చింది. యనమల రామకృష్ణుడు సోదరుడు జగన్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిసి.. ఆగమేఘాలపై చంద్రబాబునాయుడి వద్దకు ఆయనని టీడీపీ నేతలు తీసుకెళ్లారట. కూలీ మీడియా దగ్గర ఉండి చూసినట్టు రాసుకొచ్చింది. ఇంతకు యనమల రామకృష్ణుడి సోదరుడు ఎందుకు టీడీపీ పార్టీకి దూరం అవుతున్నాడో కూడా రాసుకొచ్చారు. యనమల రామకృష్ణుడు తన కూతురి కోసం తమ్ముడు రాజకీయ భవిష్యత్‌ను బలి తీసుకున్నాడట. పాపం నీలి మీడియాకి బలి తీసుకోవడం అంటే ఏమిటో తెలియకపోవచ్చు.
బలి తీసుకోవడం అంటే.. ‘సీఎం అయ్యాక సొంత చెల్లిని, తల్లిని పార్టీ నుంచి పీకి పారేయడం’, అలాగే చెల్లి ఆస్తులను కాజేయాలని ప్లాన్ వేయడం, సొంత బాబాయ్ ని అతి దారుణంగా చంపితే.. ఆ చంపిన వారికీ అండగా నిలబడటం, అన్నిటికీ మించి సీఎం ని చేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను బలి తీసుకోవడానికి పథకాలను రచించడం. ఇవి బలి తీసుకోవడం అంటే. మరి నీలి, కూలీ మీడియా ఇప్పటికైనా ఇవి తెలుసుకుంటే మంచిది. ఇక యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు విషయానికి వస్తే.. ఆయన అట తన అన్న యనమల రామకృష్ణుడు పై ఆగ్రహంతో ఉన్నాడట. నాలుగు రోజుల క్రితం యనమల రామకృష్ణుడు కోసం ఓ ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేశాడు ఆయన సోదరుడు కృష్ణుడు.
నిజానికి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యను ఇటీవల టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ నియామకానికి ముఖ్య కారణం రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడే. కానీ కృష్ణుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు అంటూ వైసీపీ మీడియా ప్రచారం చేస్తోంది. కృష్ణుడు రాజకీయాల నుంచి దూరం జరగాలని భావిస్తున్నారు. కారణం.. 2009, 2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు తుని నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి దెబ్బకు ఆయనలో నిరుత్సాహం పెరిగిపోయింది. అందుకే.. ఇక మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి, తన సీట్ తన అన్న కుమార్తెకు ఇవ్వాలని కృష్ణుడే బాబును కోరారు. ఇదంతా తెలిసినా జగన్ సంతోషించాలి అంటే.. కూలీ మీడియాకి ఇప్పుడు ఏదొక ప్రచారం కావాలి. అందుకే ఇదంతా.