HomeTelugu Big Storiesఉప్పెన రివ్యూ..

ఉప్పెన రివ్యూ..

Uppena reviewమెగామేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘ఉప్పెన’. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా ‘ఉప్పెన’పై ఆసక్తి బాగా పెరిగింది. దానికి తోడు పోస్టర్లు, టీజర్లు, పాటలు​ ఈ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ రోజు శుక్రవారం (ఫిబ్రవరి 12న) విడుదలైంది.

కథ: ఉప్పాడ గ్రామంలోని మత్య్సకార కుటుంబానికి చెందిన ఓ పేదింటి కుర్రాడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం(పంజా వైష్ణవ్‌ తేజ్‌). తండ్రి చేసే చేపల వ్యాపారానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆ ఊరి గ్రామ పెద్ద, వ్యాపారవేత్త రాయణం(విజయ సేతుపతి) కూతురు బేబమ్మ అలియాస్‌ సంగీత(కృతి శెట్టి). ఆశీ చిన్నప్పటి నుంచి బేబమ్మను ప్రేమిస్తుంటాడు. బేబమ్మకు ఆ విషయం తెలియదు. మరోవైపు తన తండ్రి రాయణంకు పరువు అంటే ప్రాణం. పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే మూర్ఖుడు. తన కూతురు ఎక్కడ ప్రేమలో పడి తన పరువు తీస్తుందనే భయంతో కుర్రాళ్ల గాలి తగలకుండా ఉమెన్స్‌ కాలేజీలో జాయిన్‌ చేయిస్తాడు. తన కూతురు కోసం స్పెషల్‌గా గ్రామానికి ఓ బస్సును కూడా వేయిస్తాడు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బేబమ్మ.. ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఓ సంఘటన వల్ల రాయణంకు తన కూతురు ప్రేమలో పడిన విషయం తెలుసి బేబమ్మను కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో బేబమ్మ ఆశీతో కలిసి లేచిపోతుంది. అయితే ఓ కారణం వల్ల ఆశీ బేబమ్మను తిరిగి రాయణంకు అప్పగిస్తాడు. తను ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించే బేబమ్మను ఆశీ ఎందుకు తిరిగి అప్పగించాడు? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే రాయణం.. తన కూతురి ప్రేమను అంగీకరించాడా లేదా? ప్రేమ దక్కించుకునే క్రమంలో ఆసి ఏం కోల్పోయాడు? చివరకు ఈ జంట ఎలా ఒక్కటైందనేదే మిగతా కథ.

నటీనటులు: వైష్ణవ్ తేజ్‌కు ఇది తొలి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించాడు. ​తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. మొదటి సినిమానే అయినా హీరో ఎంతో పరిణితితో నటించాడు. ఎమోషనల్‌ సీన్లను అవలీలగా చేసేశాడు. ఇక హీరోయిన్‌ కృతి శెట్టి (బేబమ్మ) పాత్రకు ప్రాణం పోసింది. తొలి సినిమాయే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఇక వైష్ణవ్‌ తేజ్‌ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర విజయ్‌ సేతేపతిది. రాయాణం అనే విలన్‌ పాత్రలో ఈ విలక్షణ నటుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.

విశ్లేషణ: ఈ తరహా కథలు ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా వచ్చాయి. గొప్పింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం, పరువు కోసం ఆ ప్రేమకు హీరోయిన్‌ నాన్న అడ్డుపడడం. చివరకు ఎలాగోలా హీరో హీరోయిన్లు ఒక్కడవ్వడం చాలా సినిమాల్లో చూశాం. ఈ కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. విజయసేతుపతి లాంటి విలక్షణ నటుడిని, మెగా కుటుంబం నుంచి ఓ హీరోని తన కథకు సెలెక్ట్‌ చేసుకోవడంలోనే దర్శకుడు సగం హిట్‌ కొట్టాడాని చెప్పొచ్చు. తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టించకుండా అనుకున్న కథను కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో రీవీల్‌ అయ్యే ఓ సీక్రెట్‌ మాత్రం ఈ మూవీకి హైలెట్‌ అని చెప్పొచ్చు. ఆశీ తండ్రి జాలయ్య సంబంధించిన సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు వచ్చే సన్నివేశాలు భావోద్వోగాన్ని రేకెత్తిస్తాయి. చివర్లో కృతి శెట్టి, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకు మరో హైలెట్‌ ఏంటంటే.. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికిమొత్తంగా ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పి మెప్పించడంలో దర్శకుడు కాస్త సఫలమైయ్యాడనే చెప్పొచ్చు. దగ్గట్టుగా ఉన్నాయి.

టైటిల్: ఉప్పెన
న‌టీన‌టులు: పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్

హైలైట్స్: విజయ్‌ సేతుపతి, హీరోహీరోయిన్‌ల నటన
డ్రాబ్యాక్స్: ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీత అనిపిస్తాయి

చివరిగా: ప్రేమకు సరికొత్త నిర్వచనం ‘ఉప్పెన’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu