మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘ఉప్పెన’. తొలి సినిమాతోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తెలుగు సినిమాకు అందించాడు. బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో వచ్చిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్‌ను అందుకుందని తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తాజాగా వైష్ణవ్ తేజ్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. ఆ వీడియోలో ఆయన కాస్తా జుట్టు లేకుండా ఉన్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ చేయడంతో పాటు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ వీడియోలో వైష్ణవ్ తేజ్ మ్యాజిక్ చేస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ ఈ మ్యాజిక్ ఎలా చేశాడని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదంతా బాగానే ఉన్నా.. వైష్ణవ్ తేజ్ మ్యాజిక్ కంటే ఆయన న్యూలుక్ హాట్ టాపిక్‌గా మారింది. వైష్ణవ్ ప్రస్తుతం నాగార్జున నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు ఆయన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొండపొలం, లేదా జంగిల్ బుక్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.