డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా తన తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే మంచి హిట్ డైరెక్టర్‌గా మారిపోయాడు. తాజాగా రెండో చిత్రం గురించి సన్నాహాలు మొదలు పెట్టాడు. తనకు భారీ సక్సెస్‌ను తెచ్చిపెట్టిన మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌లోనే మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అయితే బుచ్చిబాబు రెండో సినిమా ఎవరితో చేస్తారనేది టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరంగా మారింది.
మొదట్లో ఆయన రెండో చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో అన్న వార్తలు వినిపించినప్పటికీ తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య పేరు వినిపిస్తోంది. ఈ మేరకు ఆయనకు కథ వినిపించాడని, అది నచ్చిన చైతూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే.