అక్కినేని యంగ్ హీర అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు. గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా గుర్రాల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. కాగా అఖిల్ తరచుగా హార్స్ రైడింగ్ వీడియోలు షేర్ చేస్తుంటాడు. కాగా, ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలి సినిమా (ఉప్పెన) సినిమా విడుదలకు ముందే ఈ బ్యూటీ స్టార్ హోదాను పొందుతుంది. మెగాస్టార్ కూడా రాబోయే రోజుల్లో కృతి బిజీ హీరోయిన్ గా మారడం ఖాయం అనడంతో.. దర్శకనిర్మాతలు ఈ బ్యూటీపై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాలకు కృతి హీరోయిన్‌గా కమిట్ అయిన నేపధ్యంలో.. అఖిల్ సినిమాలోనూ దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.