HomeTelugu Newsనాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది: గౌతమ్‌

నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది: గౌతమ్‌

8 12
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన పడొద్దని ఆయన తనయుడు, నటుడు రాజా గౌతమ్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో తీవ్ర అస్వస్థతకు గురైన బ్రహ్మానందాన్ని వైద్యుల సూచన మేరకు ముంబయికి తరలించి శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం ఆరోగ్యంపై ఆయన తనయుడు గౌతమ్‌ స్పందించారు.

‘బ్రహ్మానందంగారికి శస్త్ర చికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు. నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు అందరూ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సుల వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. ప్రస్తుతం మేము మా తండ్రి వద్దే ఉన్నాం’ అని రాజా గౌతమ్‌ తెలిపారు.

ఈ సందర్భంగా, సినీ రచయిత కోన వెంకట్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘మన అందరి ప్రార్థనలు, దేవుడి దయతో బ్రహ్మానందంగారు ఆరోగ్యంగా ఉన్నారు. త్వరగా కోలుకుంటున్నారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన అక్కడి సిబ్బందిపై జోకులు వేస్తూ, తనదైన అలరిస్తున్నారని విన్నా’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu