మెగాపవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్త కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆనందం మునిగిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్ లాండ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఈ పిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫొటోలలో ఉపాసన తల్లిదండ్రులు కూడా కనిపిస్తున్నారు.