మెగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల తన 30వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన తన భర్తతో కలిసి విహారయాత్ర నిమిత్తం వెళ్లారు. అక్కడ చరణ్.. ఉపాసన బర్త్‌డే వేడుకను ఘనంగా జరిపించినట్లున్నారు. ఈ నేపథ్యంలో చరణ్‌కు, తన ఇంట్లోవారికి ధన్యవాదాలు చెబుతూ ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
‘మై డియర్ మిస్టర్ సి… ప్రతి రోజూ ప్రత్యేకంగా ఉండేలా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఐ రియల్లీ లవ్యూ. నిస్వార్థమైన నీ ప్రేమే నాకెంతో స్ఫూర్తినిస్తుంది. తాతగారు, నా సోదరి అనుష్పాల నాకెంతో మద్దతుగా నిలిచారు. నా పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసినందుకు అమ్మమ్మకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. నా అపోలో కుటుంబానికి కూడా థాంక్స్. నా చుట్టూ ఇంత పాజిటివ్ మనుషులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొంటూ చరణ్‌తో, కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.