HomeTelugu Big Storiesఉపాసన ట్వీట్.. ఓ అపురూపమైన ఫొటో.. వైరల్‌

ఉపాసన ట్వీట్.. ఓ అపురూపమైన ఫొటో.. వైరల్‌

8 9

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సోషల్‌మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ఆమె నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఉపాసన ఇన్‌స్టా వేదికగా ఫొటోను షేర్‌ చేశారు. అందులో ఆమె డ్రెస్సింగ్‌ టేబుల్‌ ఎదురుగా కూర్చొని సెల్ఫీ తీసుకుంటున్నట్లు కనిపించారు. ‘నేను పర్‌ఫెక్ట్‌ కాదు కానీ, నేను ఒరిజినల్‌’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఆమె షేర్‌ చేసిన ఫొటోలో ఓ విశేషం ఉంది. అదేమిటంటే.. మేకప్‌ టేబుల్‌పై సౌందర్యలేపనాల మధ్యలో ఓ అపురూపమైన ఫొటో ఫ్రేమ్‌ ఉంది. అందులో ఉపాసన, ఒక వేడుకలో మహేష్‌ కుమార్తె సితారతో కలిసి దిగిన ఫొటోను పెట్టుకున్నారు. ఉపాసన షేర్‌ చేసిన ఫొటోకు అభిమానులు, సినీ ప్రముఖులు లైకులు కొడుతున్నారు. మరోవైపు నమ్రత సైతం లైక్‌ కొట్టారు.

గతేడాది నారా బ్రహ్మాణి-లోకేష్‌ల కుమారుడు దేవాన్ష్‌ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అయితే, ఆ వేడుకకు హాజరైన మహేష్‌ కుమార్తె సితారతో కలిసి ఉపాసన ఫొటో దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆ సమయంలో ఉపాసన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘విత్‌ మై బెస్టీ సితార’ అని ఉపాసన పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!