HomeTelugu Big Storiesరామ్‌ చరణ్‌తో గొడవలు భార్య ఉపాసన కామెంట్స్‌

రామ్‌ చరణ్‌తో గొడవలు భార్య ఉపాసన కామెంట్స్‌

Upasana says my husband ram

మెగా కోడలు, పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌‌తో గొడవల గురించి తొలిసారి నోరు విప్పింది ఆయన భార్య ఉపాసన. సోషల్‌ మీడియాలో ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్, ఉపాసన ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. అంతేకాదు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడమే కాదు… తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా సాధారణ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

నిన్న (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది. అంతేకాదు 8 ఏళ్ల తమ వివాహా బంధంలో మేమిద్దరం ఎన్నోసార్లు గొడవలు పడ్డ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మా మధ్య వచ్చిన గొడలన్ని చిలిపి తగాదేలనని విడమరిచి చెప్పింది. అంతేకాదు 8 ఏళ్ళలో ఓ ప్రేమికుల దినోత్సవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.

ఒకరితో ఒకరు గడిపిన అపురూప క్షణాలంటేనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం అంటూ చెప్పుకొచ్చింది. ఎంత ఖరీదైన గిఫ్ట్స్ కాదు. మన లైఫ్ పార్టనర్‌ను ఎంతో ఆనందంగా చూసుకున్నామనే విషయానికే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. చరణ్ నాకు భర్త అనే కాదు.. మంచి ఫ్రెండ్… ఫిలాసర్ అంటూ చెప్పుకొచ్చింది. నాకు విలువైన ఎన్నో మధుర క్షణాలను చరణ్ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక పెళ్లైన తర్వాత మా మొదటి వాలెంటైన్స్ డేను నేను ఎప్పిటికీ మరిచిపోలేను. ఎందుకంటే చరణ్ సినిమా షూటింగ్‌లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నా కోసం లవ్ సింబల్‌తో కూడిన ఇయర్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన విషయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.

భార్యా భర్తలన్నాకా.. విభేదాలు రావడం ఎంతో సహజం. కాపురంలో చిన్న చిన్న గొడవలే వివాహా బంధాన్ని మరింత రాటుతేలుస్తాయి. అలా మా మధ్య ఎన్నో చిలిపి తగాదాలొచ్చాయి. వాటిని మేమిద్దరం ఎంతో కలిసి కట్టుగా ఎదుర్కొన్నాం. మాదే కాదే.. అందరి కాపురాల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎంతో కామన్ అంటూ తమ వివాహా బంధంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు ఉపాసన.

Recent Articles English

Gallery

Recent Articles Telugu