HomeTelugu Newsఉపాసన తాతయ్య తాగే డ్రింక్ ఇదేనంట..!

ఉపాసన తాతయ్య తాగే డ్రింక్ ఇదేనంట..!

3 2మెగా స్టార్‌ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ద ఎక్కువే. తనతో పాటు ఇంకో నలుగురు ఆరోగ్యాంగా ఉండాలనుకునే ఆమె తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి మంచి హెల్త్ టిప్స్ చెబుతుంటారు. వైద్య వృత్తి నేపథ్యంగా కలిగిన కుటుంబం నుండి వచ్చిన ఉపాసన తాజాగా నూతన సంవత్సరం సందర్బంగా తన తాతగారు, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మిరాకిల్ డ్రింక్ సీక్రెట్ బయటపెట్టారు. యాపిల్, క్యారెట్, బీట్ రూట్ వంటి వాటితో తయారుచేసే ఈ డ్రింక్ మంచి ఆరోగ్యాని ఇస్తుందన్న ఆమె దాన్ని తయారుచేసే విధానాన్ని సైతం వివరించి ఈ కొత్త సంవత్సరంలో దీన్నీ మీ రోజువారీ చర్యల్లో ఒకటిగా చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu