HomeTelugu Newsupasana konidela: ముఖేశ్ గారూ, నీతా గారూ మీ ఆతిథ్యం అసమానం

upasana konidela: ముఖేశ్ గారూ, నీతా గారూ మీ ఆతిథ్యం అసమానం

Upasana praises on Ambanis

upasana konidela: భారత ప్రముఖ వ్యాపారవేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అత్యంత వేడుకగా జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు ఈ సంబరాలకు హాజరైయ్యారు.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ ప్రముఖులు, ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, స్టార్ హీరో రణవీర్ సింగ్, క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో తదితరులు జామ్ నగర్ కోలాహలంలో సందడి చేశారు.

టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆహ్వానం లభించగా, వారు జామ్ నగర్ వెళ్లి అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. ఈ వేడుకలు ముగిసిన అనంతరం రామ్ చరణ్, ఉపాసన జోడీ హైదరాబాద్ తిరిగొచ్చింది. దీనిపై ఉపాసన ట్విట్టర్ లో స్పందించారు.

“అనంత్, రాధిక, యావత్ అంబానీ కుటుంబానికి శుభాభినందనలు. ముఖేశ్ గారూ, నీతా గారూ మీ ఆతిథ్యం అసమానం. ఇంకెవరూ కూడా ఇంతటి ఘనమైన ఆతిథ్యాన్ని ఇవ్వలేరేమో. మీ అద్భుతమైన ఆదరణకు కృతజ్ఞతలు. అద్భుతమైన వ్యక్తులతో సమయం అద్భుతంగా గడిచిపోయింది” అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu