తాజాగా అపోలో హాస్పిటల్స్ చిన్న పిల్లల కోసం అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రారంభించింది. ఈ అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగోను ఉపాసన ఆవిష్కరించారు. కార్యక్రమంలో అపోలో డాక్టర్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడారు.
నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది నన్ను కలిసి వారి సలహాలను ఇచ్చేవారు. అయితే కొందరు మహిళలకు ఇలాంటి సహకారం దొరకదు. ఆ విషయం తెలిసి నాకు చాలా బాధవేసింది. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు ఇలాంటి విషయాల్లో పెద్దగా మద్దతు ఉండదు. కాబట్టి అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా నేను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నాను. వీకెండ్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సను అందించబోతున్నాం.
ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నేను వారికి నా వంతు సపోర్ట్ అందించటానికి సిద్ధం. ఈ ప్రకటన చేయటానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను.. అని పేర్కొన్నారు. అపోలో పీడియాట్రిక్, అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.