టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. మెగా కోడలు ఉపాసన కొణిదెలతో కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే శర్వానంద్‌తో ఉపాసన ఓ షార్ట్ ఫిల్మ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే అపోలో లైఫ్ వైస్ ఛైర్ పర్శన్ గా, బి పాజిటివ్ మేగజైన్ చీఫ్ ఎడిటర్ గా ఉన్న ఉపాసన యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కూడా నిర్వహిస్తున్నారు. కరోనా కష్ట సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు అందించిన సేవలు అభినందించదగ్గినవి. ఈ సమయంలో వారందించిన సేవలను సామాన్య ప్రజలకు తెలియచేస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ ను తీయాలని ఉపాసన భావిస్తున్నారట.
అయితే ఇందులో యువ హీరో శర్వానంద్ కూడా నటిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు డాక్టర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారని అంటున్నారు. చరణ్ – శర్వా ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఆ విధంగా శర్వా కూడా ఈ పాత్ర చేయడానికి అంగీకరించారట. ఈవార్తలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శర్వానంద్ మహా సముద్రంలో నటిస్తున్నాడు. అలానే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించాడు.