ఉపాసన కేవలం రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూ అదరగొడుతున్నారు. అంతేకాదు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు, మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రామ్ చరణ్‌తో పెళ్లి తర్వాత ఉపాసన మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఇందులో భాగంగా ఉపాసన తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఉపాసన ఆపిల్‌తో ఓ వంటను చేశారు. అది ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పారు. అంతేకాదు ఈ రిసిపివు తన ఫ్యామిలీ మెంబర్స్‌కు అంకితం చేస్తున్నానని తెలిపారు. కాగా శీమతి ఉపాసన అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్ వేదికగా ఇప్పటికే ఉపాసన చానెల్ ఏకంగా లక్ష సబ్‌స్ర్కైబర్లను సొంతం చేసుకుంది. దీంతో యూట్యూబ్ టీమ్ ఉపాసనను ప్రత్యేకంగా అభినందిస్తూ సిల్వర్ ప్లగ్ మొమెంటోను బహూకరించిన సంగతి తెలిసిందే.