మెగా కోడలు ఉపాసన తరచు వార్తల్లో నిలుస్తుంది. ఉపాసన సమాజంలో జరిగే ఇష్యూస్ పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఏదైనా ముఖ్యవిషయం ఉంటే అందరితో పంచుకుంటూ ఉంటుంది. కేవలం ఉపాసన మెగా కోడలుగానే కాకుండా.. అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేస్తూ.. తనకు తెలిసిన ఆరోగ్య చిట్కాలను ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చే వరకు వారికి సంబందించిన అప్‌డేట్స్ కూడా ఆమే షేర్ చేస్తూ ఉండేది.
తాజాగా ఈమె ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా ఒక పులి పిల్లకు ఓ బాటిల్‌లో పాలు తాగిస్తున్న ఫోటోను షేర్ చేసింది. పర్యావరణం సమతుల్యతను కాపాడటంలో అన్ని ప్రాణులకు సమాన బాధ్యత ఉంది. అందులో పెద్దపులికి విశేష ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా పులులు అంతరించి పోవడం వల్ల ఎన్నో దుష్ఫరిణాలు ఏర్పడుతున్నాయి. అందుకే మన ప్రభుత్వం కూడా మన జాతీయ జంతువు అయిన పులిని కాపాడే విషయంలో ఎన్నో జాగ్రత్తలతో కూడిని చట్టాలు చేశారు. ఎన్ని చట్టాలు చేసినా.. కొంత మంది వేటగాళ్ల వల్ల అవి బలైపోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉపాసన పులులను కాపాడుదాం అంటూ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పిలుపు నివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఉపాసన ధైర్యాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలు చేస్తున్నారు.
Was so excited to feed a tiger cub.But would never do it again!
Statistics show that there are more tigers in captivity than in the wild
#InternationalTigerDay2020 if u reside in hyderabad- there are tigers living in the wild less than 3 hours away🐯 than need ur protection pic.twitter.com/qi4N1PnFwU
— Upasana Konidela (@upasanakonidela) July 29, 2020