HomeTelugu Trendingమెగా ఫ్యామిలీలో పుట్టిన రోజు వేడుకలు.. ఉపాసన ట్వీట్

మెగా ఫ్యామిలీలో పుట్టిన రోజు వేడుకలు.. ఉపాసన ట్వీట్

2 26
మెగా ఫ్యామిలీలో పుట్టినరోజు వేడుకలు వచ్చాయంటే చాలు.. చాలా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయితే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్.. తదితరుల పుట్టిన రోజులు వచ్చినా వారికి పండుగే. అయితే.. మెగా ఫ్యామిలీలో తాజాగా మరో పుట్టిన రోజు జరిగింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గారాల పట్టి నవిష్క పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదీ క్రిస్‌మస్ రోజు కావడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఉపాసన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. భర్త రామ్‌చరణ్‌తో పాటు, శ్రీజ, కల్యాణ్ దంపతుల కూతురితో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటో మెగా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో లైకులు, షేర్లతో హోరెత్తించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu