ప్రస్తుతం ‘సైరా’ ఫీవర్ సందడి చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చరిత్రత్మిక చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ విజయాన్ని మూవీ యూనిట్‌తోపాటు సైరా నిర్మాత రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ‍్యంతో తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తున్నారు. తాజాగా తమన్నాకు తనదైన శైలిలో అభినందనలు తెలిపారు ఉపాసన. అద్భుతంగా నటించి మెప్పించిన తమన్నాకు ఆమె ప్రత్యేక బహుమతి అందజేశారు. ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ‘నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.
మరోవైపు ‘సైరా’ విజయం మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కొత్త ఊపిరినిచ్చింది. సినిమాలో నర్సింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా అద్భుత నటనతో సైరా లక్ష్మిగా నిలిచిపోనుందంటూ తమన్నాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ‘సైరా’ అంటూ సాగే పాటలో తమన్నా హావభావాలు అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
A gift for the super @tamannaahspeaks
from Mrs Producer 😉❤️🥳
Missing u already. Catch up soon. #SyeraaNarashimaReddy pic.twitter.com/rmVmdwWNAd— Upasana Konidela (@upasanakonidela) October 3, 2019