
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్‌గా, మెగా ఫ్యామిలీ చెందిన వ్యక్తిగా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్లొనే ఉపాసన వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేషన్ తరఫున ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులయ్యారు. దీనిపై ఉపాసన స్పందిస్తూ… కరోనా వేళ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.
అలాగే, అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ క్షేత్ర సిబ్బంది కూడా కఠిన వాతావరణ పరిస్థితుల్లో కష్టపడుతుంటారని వివరించారు. ఆ ప్రాంతంలో నిఘా కోసం రోజుకు దాదాపు 15-20 కిలోమీటర్ల మధ్య నడుస్తుంటారని చెప్పారు. అడవి జంతువులను కాపాడే క్రమంలో వాటికి హాని జరగకుండా వేటగాళ్లను ఎదుర్కొనే క్రమంలో ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అటువంటి ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోల తరఫున ప్రచారకర్తగా నియమించబడ్డానని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
View this post on Instagram













