HomeTelugu Big Storiesడాన్స్‌ షో ప్రారంభించనున్న రామ్‌చరణ్‌ దంపతులు

డాన్స్‌ షో ప్రారంభించనున్న రామ్‌చరణ్‌ దంపతులు

Upasana Introducinga a Progఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకించి చెప్పానరం లేదు. ఫ్యామిలీ బాధ్యతలతో పాటు అపోలో హాస్పిటల్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ గా మరియు బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా బిజీగా ఉన్న ఉపాసన.. ఇటీవల URLife.co.in అనే వెబ్ సైట్ ని ప్రారంభించి పోషకాహారంపై అవగాహన కల్పిస్తోంది. దీనికి అక్కినేని కోడలు సమంత అతిథి సంపాదకురాలిగా ఉన్నారు. అయితే లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో భాగంగా చరణ్ ‘హీల్ యువర్ లైఫ్ త్రూ డ్యాన్స్’ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడు. దీని ముఖ్య ఉద్దేశ్యం దివ్యాంగుల్లో వున్న టాలెంట్ ని.. డ్యాన్స్ ని ప్రపంచానికి తెలియజేయడం అని తెలుస్తోంది. ఈ ఆన్ లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.

చరణ్ తో పాటు ఈ షోలో కొరియోగ్రాఫర్స్ కమ్ డైరెక్టర్స్ ప్రభుదేవా మరియు ఫరాఖాన్ లు కూడా పాల్గొనబోతున్నారు. దివ్యాంగుల కోసం తాను ఈ డాన్స్ షోను స్టార్ట్ చేస్తున్నట్టుగా చరణ్ తాజాగా ఓ వీడియో ద్వారా తెలిపారు. ‘చిన్నప్పటి నుంచి తనకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఇప్పుడు యునిక్ డ్యాన్స్ టాలెంట్ షో ని ప్రటిస్తున్నాను. ప్రతిభను కలిగి ఉన్న లవ్లీ దివ్యాంగ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ urlife.co.in లో ఎంట్రీలను పొంది తమ వీడియోలను అప్లోడ్ చేయండి’ అని చరణ్ తెలిపాగు. మెంటల్ డిస్టర్బ్ అయిన వారి వీడియోలను చూశానని.. అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని అధిగమిస్తూ వారు చూపించిన టాలెంట్ ని చూసి ఎంతో నేర్చుకున్నానని.. దివ్యాంగ సోదరసోదరీమణులకు అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి ఈ షోను సక్సెస్ చేయాలని రామ్ చరణ్ కోరాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu