HomeTelugu Trendingరామ్‌ చరణ్‌పై ఉపాసన ట్వీట్‌ వైరల్‌

రామ్‌ చరణ్‌పై ఉపాసన ట్వీట్‌ వైరల్‌

Upasana emotional 1

మెగా కపుల్‌ పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ -ఉపాసనల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చరణ్‌ సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకోగా.. ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 11 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ నేటి తరం యువ జంటలకు ఆదర్శంగా నిలుస్తోంది.

తాజాగా భర్త చరణ్‌పై ఉపాసన తనకున్న ప్రేమను చాటుకుంది. చరణ్‌-ఉప్సీ దంపతులు ఇటీవలే ఓ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై వీరు కనిపించారు. ఇప్పటి వరకూ ఏ టాలీవుడ్‌ జంటకు ఆ ఛాన్స్‌ రాలేదు.

మొదటిసారి అరుదైన గౌరవాన్ని రామ్ చరణ్ దంపతులు అందుకున్నారు. దీనిపై ఉపాసన ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించింది. ‘విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఓ స్త్రీ ఉంటుందని చెబుతారు. కానీ నేనేం చెబుతానంటే.. విజయవంతమైన ప్రతి మహిళ వెనుక మద్దతు, రక్షణ ఇచ్చే పురుషుడు ఉంటాడు’ అంటూ పేర్కొంది.

దీంతో పాటు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజ్‌ ఫొటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మెగా కోడలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆదర్శ దంపతులు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu