మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. గత 20 రోజుల్లో పలు విషాద ఘటనలు తమను కలిచి వేసేలా చేశాయంటూ సినీనటుడు తమ కుటుంబంలో ముగ్గురు పెద్దవారిని కోల్పోయామని, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి బాధాకర వార్త విన్నామని, దేశంలో కరోన కేసులు ఉద్ధృతంగా పెరిగిపోతున్నాయని తెలిపింది. మన దేశాన్ని రక్షించడానికి జవాన్లు ప్రాణాలు ఇస్తున్నారని గుర్తు చేసింది.
సరిగ్గా వారం రోజుల క్రితం తమ 8వ పెళ్లి రోజు తేదీ వచ్చిందని, అయితే, దాన్ని జరుపుకునే మూడ్ లో తామిద్దరం లేమని తెలిపింది. అందుకే, ఆ రోజు ఇంట్లో మూడు రకాల ఆవకాయ పచ్చడితో అన్నం తింటూ, చిప్స్ నములుతూ, టీవీ చూస్తూ గడిపామని చెప్పింది. కలిసి ఉండడంపై మరపురాని పాఠం నేర్చుకున్నానని చెప్పింది.