HomeTelugu Trendingపెళ్లి తర్వాత ఇబ్బంది పడ్డా.. ఉపాసన కామెంట్స్‌

పెళ్లి తర్వాత ఇబ్బంది పడ్డా.. ఉపాసన కామెంట్స్‌

4 7
మెగా కోడలు ఉపాసన తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివాహ జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. మెట్టినింటిలో అడుగుపెట్టాక జీవితంలో సర్దుబాటు అంటే ఏమిటో తెలిసిందని, అడ్జస్ట్ అయి బ్రతకడం నేర్చుకున్నానని, కాస్త ఇబ్బంది కూడా పడ్డానని చెప్పింది. ఆ తర్వాత మా అత్తమ్మ సురేఖ..నన్ను కన్న కూతురిలా చూసుకుంది. మెట్టినింటిలో అడుగుపెట్టాక జీవితంలో సర్దుబాటు అంటే ఏమిటో తెలిసిందని, అడ్జస్ట్ అయి బ్రతకడం నేర్చుకున్నానని, కాస్త ఇబ్బంది కూడా పడ్డానని చెప్పింది.రాను.. రాను.. తనకు అత్త (సురేఖ) ప్రతి విషయంలో ఎంతో సహాయ సహాకారాలు అందిస్తూ వచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఆమె నేను ఏమి చేసినా.. అభ్యంతరం పెట్టేవాళ్లు కాదు. మొత్తం మీద ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను.. అలాంటి ఉమ్మడి కుటుంబంలోనే కోడలుగా అడుగుపెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక చరణ్‌ గురించి మాట్లడుతూ.. తనకు నచ్చిన సెలబ్రిటీని వివాహం చేసుకోవడం అదృష్టమని, ఆన్‌స్క్రీన్ రామ్ చరణ్‌కి ఇంట్లో ఉండే రామ్ చరణ్‌కి చాలా తేడా ఉంటుందని ఆమె చెప్పింది. కాకపోతే ఆ సీక్రెట్ మాత్రం చెప్పానంటూ ఆసక్తికరంగా స్పందించింది ఉపాసన. రామ్ చరణ్, తాను భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటూనే ఒకరి వృత్తిని మరొకరం గౌరవిస్తామని ఆమె తెలిపింది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఇద్దరికీ కావాల్సినంత సమయం దొరకడంతో ఇంట్లోనే ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశామని ఉపాసన చెప్పింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అభిమానులతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చింది ఉపాసన.

Recent Articles English

Gallery

Recent Articles Telugu