HomeTelugu Trendingసమంతది స్వచ్ఛమైన ప్రేమ: ఉపాసన

సమంతది స్వచ్ఛమైన ప్రేమ: ఉపాసన

Upasana about Samantha
మెగా కోడలు ఉపాసనకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. నిత్యం హాస్పిటల్ పనులు, బిజినెస్ వ్యవహారాలతో తలమునకలైన ఫ్యామిలీ విషయం వచ్చేసరికి మెగా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ ఉపాసన ఎన్నడూ లేనివిధంగా పలు విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకోంది. మొదటి నుంచి ఉపాసన, హీరోయిన్ సమంత మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.

ఇక తన ఫ్రెండ్‌ గురించి ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. సమంత నుంచి తను చాలా నేర్చుకున్నానని చెప్పింది.”నేను తెలంగాణ బిడ్డను.. మాకు పండగలప్పుడు నాన్ వెజ్ తినడం అలవాటు. దసరాకు కూడా నేను మాంసం తింటాను. కానీ, ఎప్పుడైతే సమంతను కలిశానో, ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టానో మాంసం తినడం తగ్గించాను. సమంత చాలా మంచిది. ఆమెది చాలా స్వచ్ఛమైన మనసు. స్వచ్ఛమైన ప్రేమ. కానీ, అది చాల తక్కువమందికే తెలుసు. సమంతలో సాయం చేసే గుణం ఎక్కువ ఉంటుంది.. అది అందరికి నచ్చుతుంది. ఎన్నో విషయాల్లో ఆమె నాకు సాయం చేసింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మెగా కోడలు వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu