కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాల విద్యార్థుల వార్షిక పరీక్షలు రద్దు చేసింది. ఫైనల్ పరీక్షలు లేకుండానే పై తరగతికి అర్హత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఆ సెలవులను మరింత పొడిగించింది. ఈ నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలను రద్దు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటి వరకూ 16 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.