నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ ‘ టాక్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నెల 17నుండి ‘ఆహా’లో సీజన్ -3 ప్రారంభం కానుంది. సీజన్ 1 .. సీజన్ 2 మాదిరిగానే సీజన్ 3కి కూడా బాలయ్యనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షోకి సంబంధించి .. ఫస్టు ఎపిసోడ్ లో ఎవరు ప్రేక్షకుల ముందుకు రానున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ‘భగవంత్ కేసరి’ టీమ్ తో ఫస్టు ఎపిసోడ్ నడుస్తుందనే టాక్ వినిపించింది. అందుకు సంబంధించిన షూటింగు జరిగిందనే వార్త కూడా షికారు చేసింది. అందుకు తగినట్టుగానే ఫస్టు ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలను వదిలారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్య, అనిల్ రావిపూడి, కాజల్, శ్రీలీల సందడి చేసినట్టుగా తెలుస్తోంది.
లైట్ పింక్ కలర్ డ్రెస్ లో బాలయ్య కనిపిస్తున్నారు. ఎప్పటిలానే ఈ ఎపిసోడ్ లో ఆయన అల్లరి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీలీల స్పెషల్ జ్యుయలరీతో స్టేజ్ పై అందాలు విరబోసింది. సింపుల్ గా కనిపిస్తూనే, తన గ్లామర్ ఎంతమాత్రం తగ్గలేదనే విషయాన్ని నిరూపిస్తున్నట్టుగా కాజల్ కనిపించింది.