నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ -3’. ఈ షోలో ఇటీవల ‘భగవంత్ కేసరి’ టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినిమాతోనే ఈ సీజన్ మొదలు కావడం ఆయన అభిమానులను ఖుషీ చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ టీమ్ ఈ వేదికపై సందడి చేయనుంది.
తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగు జరిగింది. రణ్ బీర్ కపూర్ .. రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను రూపొందించాడు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాను, డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘అన్ స్టాపబుల్ సీజన్ 3’లో టీమ్ పాల్గొంది.
అందుకు సంబంధించిన ఫొటోలు ‘ఆహా’ నుంచి రావడంతో, ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ‘యానిమల్’ సినిమా టీమ్ పాల్గొన్న ఎపిసోడ్ ను ఈ నెల 24వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ.. ‘ఆహా’ ఒక ప్రోమోను విడుదల చేశారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేశ్ ఒబెరాయ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా వంటి సీనియర్ స్టార్స్ ఈ సినిమాకి హైలైట్.