Rukmini Vasanth Telugu:
ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ఆ సినిమాలో నటీనటుల మీద క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని కొన్నిసార్లు క్రేజ్ లేకపోయినా కూడా సోషల్ మీడియాలో వాళ్ల మీద హైప్ మాత్రం పెరుగుతూ వస్తుంది. ఈ మధ్యనే ఇండస్ట్రీ లోకి వచ్చిన రుక్మిణి వసంత విషయంలో కూడా అదే జరుగుతుంది.
కన్నడ లో సప్త సాగరదాచే ఎల్లో (తెలుగులో సప్త సాగరాలు దాటి) సినిమాతో రుక్మిణి వసంత్ ఫేమ్ అందుకుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా బాగానే ఆడింది. సినిమాలు ఆమె నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.
అయితే ఈ సినిమా తర్వాత ఆమెకి కన్నడలో రెండు, తమిళ్లో రెండు ఆఫర్లు అయితే వచ్చాయి. ఆ సినిమాలతో ఇమె బిజీగానే ఉంది. కానీ తెలుగు డైరెక్టర్లు నిర్మాతలు ఈమె చుట్టూనే తిరుగుతున్నారు అని, ఈమెతో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిగో పులి అంటే అదుగో తోక లాగా సినిమా హిట్ అయింది అనగానే.. టాలీవుడ్ మొత్తం ఆ హీరోయిన్ వెనకే ఉంటున్నట్లు వార్తలు వస్తూ ఉంటాయి. మరి అన్ని తెలుగు ఆఫర్లు వచ్చినప్పుడు ఆమె ఏదో ఒక సినిమాకి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండాలి కదా.
ఆమెకి తెలుగు నుంచి మరీ అంత పెద్ద ఆఫర్లు ఏమి రావడం లేదు. ఆమె చేసిన ఆశ్రమ హిట్ అయి ఉండొచ్చు కానీ.. ఆమె పేరు కూడా ఇంకా చాలా మందికి తెలియదు. భవిష్యత్తులో ఆమెకి ఏమైనా తెలుగు ఆఫర్లు వస్తాయో లేదో తెలియదు కానీ.. ఈ లోపే సోషల్ మీడియాలో ఆమెకు స్టార్ స్టేటస్ ఇచ్చేస్తున్నారు.