పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలు కలిగి ఉంటే ఇకపై నేరంగా పరిగణిస్తారు. పెళ్లికాని జంటలు లైంగిక సంబంధం కలిగి ఉండడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కొత్త చట్టాలను తయారు చేస్తోంది ఇండోనేషియా ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక చట్టాలను రూపొందిస్తోంది. కొత్త చట్టాల ప్రకారం పెళ్లికి ముందు సెక్స్ సంబంధాలున్న వారికి జైలు శిక్ష తప్పదు. అయితే ఈ చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెళ్లికానివారు దేశంలో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరంగా బిల్లు రూపొందిస్తున్నారు.. వీటిలో కొన్ని మార్పులు చేస్తున్నారు.. వయసు పరిమితిని పొందుపర్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బిల్లు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.