HomeTelugu Trendingసాయిధరమ్‌ తేజ్‌ను పరామర్శించిన మంత్రి కిషన్‌ రెడ్డి

సాయిధరమ్‌ తేజ్‌ను పరామర్శించిన మంత్రి కిషన్‌ రెడ్డి

Union Minister Kishan Reddy
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని సాయిధరమ్‌ తేజ్‌ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదం, తదితర విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. బిజీ షెడ్యూల్‌లో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించినందుకు కిషన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు సాయిధరమ్‌ తేజ్‌. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.

రెండు నెలల క్రితం సాయిధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన సంగతి తెలిసిందే. అప్ప‌టి నుంచి సుమారు 40 రోజుల‌కు పైగా అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందాడు. అనంతరం తన బర్త్‌డే రోజు డిశ్చార్జ్‌ అయిన సాయిధరమ్ తేజ్‌ ఇంటికి వచ్చాడు. ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటి నుంచి అనేక మంది సాయిధరమ్‌ తేజ్‌ను వచ్చి కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కిషన్‌ రెడ్డి కూడా వచ్చి పరామర్శించారు. ఇటీవల సాయిధరమ్ తేజ్‌ తన ఫ్యాన్స్‌కు ఆడియో ద్వారా సందేశం పంపిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu