Harom Hara OTT:
హీరో నవదళపతి సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన “హారోం హారా” సినిమా అహా మరియు ఈటీవీ విన్ వంటి ప్రముఖ ఓటీటీ లలో ఈ రోజు అనగా జులై 11 న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఆ రెండు ఓటీటీ లలో ఈ సినిమా అందుబాటులో లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.
ఓటీటీ లలో సినిమా విడుదల ఎందుకు వాయిదా పడింది దాని వెనుక కారణం ఏంటి అని తెలియకపోవడం తో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. దానికి తోడు ఆయా ఓటీటీ వారు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయకపోవడం అభిమానుల అసంతృప్తిని మరింత పెంచింది. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులు దీని గురించి క్లారిటీ అడుగుతున్నారు.
“హారోం హారా” సినిమాకు జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ ఇందులో హీరోయిన్ గా నటించారు. సునీల్, జయప్రకాశ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుమంత్ జీ. నాయుడు ఈ సినిమాను నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సినిమాకి సంగీతం అందించారు.
సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు మంచి మౌత్ టాక్ వినిపించింది కానీ అది కలెక్షన్ల రూపంలో మాత్రం కనపడలేదు. ఎంత మంచి రివ్యూస్ వచ్చినా కూడా సినిమా ను ఎవరూ కాపడలేకపోయారు. అయితే ఓటీటీ లలో సినిమా చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అనుకోకుండా ఇందులో సినిమా విడుదల వాయిదా పడడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
కనీసం ఆహా మరియు ఈటీవీ విన్ వారు త్వరలోనే ఈ సినిమా విడుదల గురించి రియాక్ట్ అయ్యి కొత్త విడుదల తేదీని ప్రకటించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సమస్యకు కారణం అయినా చెప్పమని ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. కొందరేమో కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడి ఉండచ్చు అని ఇవాళ రేపట్లో సినిమా విడుదల అవుతుంది అని అంటున్నారు కానీ ఇందులో నిజానిజాలు కూడా తెలియాల్సి ఉంది.