HomeTelugu Trending'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..' టీజర్‌

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’ టీజర్‌

2 22
ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశింతే ప్రతీకారమ్‌’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. శోభూ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
‘కేరాఫ్‌ కంచరపాలెం’ లాంటి విభిన్న కథా చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన వెంకటేశ్‌ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..’ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సత్యదేవ్‌ ఫొటోగ్రాఫర్‌గా
కనిపించనున్నారు. టీజర్‌లోని మాటలు, బ్యాంక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను చూస్తుంటే ‘కేరాఫ్‌ కంచరపాలెం’ గుర్తుకువచ్చేలా ఉంది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu