HomeTelugu Reviews'ఉగ్రం' మూవీ రివ్యూ

‘ఉగ్రం’ మూవీ రివ్యూ

Ugram Movie Review

కామెడీ హీరో అల్లరి నరేష్‌ నటించిన తాజా చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ సినిమాతో యాక్షన్‌ సినిమాలకు నాంది పలికిన అల్లరి నరేష్‌ ఆ తరువాత.. ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం సినిమా కూడా చేశాడు. మళ్లీ ఇప్పుడు కూడా ఇదే కోవ‌లో ఆయ‌న చేసిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ఉగ్రం. టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న న‌రేష్‌కు నాందితో హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమాను తెర‌కెక్కించారు. జోనర్‌ మర్చిన నరేష్‌కు.. ఉగ్రం కలిసి వచ్చిందా! ఉగ్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? అస‌లు ఉగ్రం సినిమాతో ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకున్నారు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

వరంగల్‌లో పోలీస్ ఆఫీస‌ర్ అయిన శివ కుమార్ (అల్ల‌రి న‌రేష్‌) త‌న ఏరియాలో త‌ప్పు చేసే వారిని క‌ఠినంగా శిక్షిస్తుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన భూస్వామి కూతురు (మిర్నా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. ఐదేళ్ల త‌ర్వాత సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అయిన శివ‌కు కొన్నాళ్ల‌కు సీఐగా ప్ర‌మోష‌న్ వ‌స్తుంది. అదే క్ర‌మంలో న‌లుగురు యువ‌కులు గంజాయి మ‌త్తులో అమ్మాయిల‌ను ఏడిపిస్తున్నార‌ని తెలిసి అక్క‌డ‌కు వెళ్లి వాళ్ల బెండు తీసి జైలు పంపుతాడు శివ‌. దాంతో ఆ న‌లుగురు శివ‌పై క‌క్ష పెంచుకుంటారు. జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే శివ ఇంట్లో లేని స‌మ‌యంలో అక్క‌డ‌కు వెళ్లి శివ భార్య‌ను ఇబ్బంది పెడ‌తారు. విష‌యం తెలిసిన శివ కుమార్ వారిని కాల్చి చంపేస్తాడు.

అయితే శివ‌ ఎప్పుడూ డ్యూటీ అంటూ ఉండ‌టం వ‌ల్ల‌నే త‌న‌కు ఇబ్బందులు ఎదురయ్యాయ‌ని భావించిన అత‌ని భార్య పుట్టింటికి వెళ్లిపోవాల‌ని అనుకుంటుంది. శివ భార్య‌ను, పాప‌ను వ‌రంగ‌ల్‌లో దిగ‌బెట్ట‌టానికి కారులో వెళుతుండ‌గా పెద్ద ప్ర‌మాదం జ‌ర‌గుతుంది. అత‌ని భార్య‌, పాప క‌న‌ప‌డుకుండా పోతారు. మ‌రో వైపు శివ‌కు డిమ్నీషియా (లేనిది ఉన్న‌ట్లు ఊహించుకునే జ‌బ్బు) వ‌స్తుంది. ఇంత‌కీ నిజంగానే శివ భార్య, పాప క‌నిపించ‌కుండా పోతారా? అస‌లు శివ‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు కార‌ణం ఎవ‌రు? శివ కేసుని ఎలా ప‌రిష్క‌రించుకున్నాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Ugram 1

నాంది వంటి స‌క్సెస్ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా కావ‌టంతో ఉగ్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. న‌రేష్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ నుంచి ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఉగ్రం మూవీ ఓ స‌స్పెన్స్‌తో కూడా మిస్సింగ్ మిస్ట‌రీగానే సాగుతుంది. ఇంట‌ర్వెల్ త‌ర్వాత సినిమా ఇంట్రస్టింగ్‌గా అనిపించ‌దు. రొటీన్ యాక్ష‌న్ డ్రామా తీరుతో ముందుకు సాగిపోతుంది. ఇక అస‌లు సీక్రెట్ రివీల్ కావ‌టం, దాని చుట్టూ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను అల్ల‌టం కాస్త బోరింగ్‌గా అనిపించింది.

ఇక అల్లరి నరేష్‌ను ఈ రేంజ్ సీరియ‌స్ యాక్ష‌న్ రోల్‌లో చూసుండ‌రు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల త‌న‌ను పక్కా మాస్ హీరోగా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని యాక్ష‌న్ పార్ట్‌ను చిత్రీక‌రించిన విధానం చూస్తే క్లియ‌ర్ క‌ట్‌గా తెలుస్తుంది. ఇక మిర్నా మీన‌న్ పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించింది. ఇంద్ర‌జ, శ‌త్రు, విక్ర‌మ్ జీత్ విర్క్ తదితరులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమా అంతా తానై నడిపించే ప్రయత్నం చేశాడు అల్లరి నరేష్. మ‌రి ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అయితే ఓ యాక్ష‌న్ ప్యాట్ర‌న్‌తో అలా సాగిపోతుంది.

సినిమాటోగ్ర‌ఫీ బావుంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల నేప‌థ్యం సంగీతం పర్వలేదు. యాక్ష‌న్ స‌న్నివేశాలు బావున్నాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌.. ప్రీ క్లైమాక్స్‌లో హిజ్రాల వేషం వేసుకున్న విల‌న్స్‌తో హీరో చేసే ఫైట్ ఇవ‌న్నీ మాస్‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి. హ‌రీష్ పెద్ది, సాహు గార‌పాటి నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

టైటిల్‌ :’ఉగ్రం’
నటీనటులు: అల్లరి నరేష్, మిర్నా, శత్రు, ఇంద్రజ తదితరులు
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: సాహు గారపాటి-హరీష్ పెద్ది
సంగీతం: శ్రీ చరణ్ పాకాల

చివరిగా: మిసైన మిసింగ్‌ మిస్టర్‌ ‘ఉగ్రం’

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu