దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). ఈ సినిమా నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ని ఉగాది సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ని కొంతమంది ఎత్తుకొని పైకి విసురుతూ సందడి చేస్తుండగా, ఇద్దరు హీరోలు చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్‌గా నటించనున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నార. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Wishing everyone a prosperous year ahead.. 💛💛💥 #ఉగాది#ಯುಗಾದಿ #GudiPadwa #नवसंवत्सर #தமிழ்ப்புத்தாண்டு #വിഷു #ਵੈਸਾਖੀ #RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @PenMovies @LycaProductions pic.twitter.com/oHSlYWozNR
— RRR Movie (@RRRMovie) April 13, 2021