HomeTelugu TrendingSree Vishnu: అప్పుడు ఉదయ్ కిరణ్ హీరోయిన్ మళ్ళీ శ్రీ విష్ణు సరసన

Sree Vishnu: అప్పుడు ఉదయ్ కిరణ్ హీరోయిన్ మళ్ళీ శ్రీ విష్ణు సరసన

Uday Kiran heroine to romance Sree Vishnu
Uday Kiran heroine to romance Sree Vishnu

Sree Vishnu Next Movie:

కామెడీకి పెద్దపీట వేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఒప్పుకుంటూ.. శ్రీ విష్ణు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్యనే సామజ వరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో మంచి హిట్లు అందుకున్న శ్రీ విష్ణు త్వరలో ఒక తెలుగు హిందీ బైలింగ్యుల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారు. ఆమె దివ్య ఖోస్లా కుమార్. ఈమెకి టాలీవుడ్ తో బాగానే సంబంధం ఉంది కానీ ఈమె గురించి చాలా కొంతమందికి మాత్రమే తెలుసు.

ఈమె భర్త భూషణ్ కుమార్ ప్రభాస్ ఆది పురుష్, రాధే శ్యామ్ సినిమాల ను నిర్మించిన టి సిరీస్ ప్రొడక్షన్ బ్యానర్ డైరెక్టర్ భూషణ్ కుమార్. దివ్యకి తెలుగు ప్రేక్షకులతో కూడా డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అసలు ఆమె కెరియర్ మొదలుపెట్టిందే తెలుగు ఇండస్ట్రీ తో. 17 ఏళ్ల వయసులో దివ్య ఖోస్లా కుమార్ లవ్ టుడే అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమాలో ఒకప్పటి ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు.

ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. తరువాత పలు హిందీ సినిమాలలో నటించిన దివ్య మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. తెలుగులో నిన్న మొన్నటిదాకా స్టార్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ డెబ్యూ సినిమా యారియాన్ కి దర్శకత్వం వహించింది కూడా ఈమె.

ఇక శ్రీ విష్ణు సినిమా సంగతికి వస్తే ఈ సినిమాకి హీరో హీరోయిన్ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. రజినీకాంత్ బాషా ఫేమ్ ఫిలిం మేకర్ సురేష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఈషా డియోల్, సోని రాజ్దాన్, పారేశ్ రావల్, ఇషితా చౌహాన్, తుషార్ కపూర్, మరియు ప్రియాంక చహార్ ఈ సినిమాకి కీలక పాత్రలలో కనిపించనున్నారు. బాలీవుడ్ లో ప్యాడ్ మాన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కహాని వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రేరణ అరోరా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu