HomeTelugu Trendingబెల్లంకొండ 'టైసన్‌ నాయుడు' ఫస్ట్‌ గ్లింప్స్‌

బెల్లంకొండ ‘టైసన్‌ నాయుడు’ ఫస్ట్‌ గ్లింప్స్‌

Tyson Naidu First Glimpseబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘టైస‌న్ నాయుడు’. ఈ రోజు బెల్లంకొండ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు.. ఫస్ట్ లుక్‌, ఫస్టు గ్లింప్స్‌ను విడుదల చేశారు. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ గ్లింప్స్ చూస్తే.. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. మ‌రోవైపు బెల్లంకొండ ముచ్చటగా మూడో సారి పోలీస్‌గా కనిపించబోతున్నాడు.

గతంలో కవచం, రాక్షసుడు సినిమాల‌లో పోలీస్ రోల్స్ చేయ‌గా.. కవచం కమర్షియల్ ఫేయిల్యూర్ గా మిగిలింది. 14 రీల్స్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్ తో రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu