హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మలక్‌పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు, స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికిపైగా గాయాలైనట్లు సమాచారం. ఐదు బోగీల వరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాచిగూడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలవల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంటున్నారు. ట్రాక్‌పై ఒక రైలు ఉండగా మరో రైలుకు ఎలా సిగ్నల్స్ ఇస్తారని ప్రశ్నించారు.క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు. సంఘటన స్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, రైల్వే సిబ్బంది అతడిని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రమాదంపై రైల్వే అధికారులెవరూ ఇప్పటి వరకు స్పందించలేదు.