
Bollywood celebrity marriages 2025:
బాలీవుడ్‌లో పెళ్లి సందడి మొదలవబోతోందని తాజాగా ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, కృతి సనోన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని ఓ Reddit పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
శ్రద్ధా కపూర్ చాలా కాలంగా స్క్రీన్‌ప్లే రైటర్ రాహుల్ మొడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా Cosmopolitan ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి స్వయంగా చెప్పిన శ్రద్ధా – “నా పార్ట్‌నర్‌తో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. కలిసి సినిమాలు చూడటం, డిన్నర్‌కు వెళ్లడం, ట్రావెలింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది.” అని పేర్కొంది.
ఈ మధ్యే ఆమె “R” అక్షరంతో ఉన్న పెండెంట్ ధరించడం కూడా ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. దీంతో ఏప్రిల్‌లోనే శ్రద్ధా పెళ్లి జరగబోతోందని ప్రచారం ఊపందుకుంది.
కృతి సనోన్ చాలా కాలంగా వ్యాపారవేత్త కబీర్ బహియాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పండుగలు, హాలిడేలలో కలిసి గడుపుతుంటారని, వారి ఫొటోలు తరచూ వైరల్ అవుతున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ప్రస్తుతం Tere Ishq Main షూటింగ్ పూర్తి అయిన తర్వాత కృతి పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమవుతాయని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకేసారి పెళ్లి చేసుకుంటే బాలీవుడ్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఖాయం. వీరి పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే!