HomeTelugu Trendingఫౌండేషన్ స్టార్ట్‌ చేసిన విజయ్‌ దేవరకొండ.. నేనున్నా అంటున్న డైరెక్టర్‌!

ఫౌండేషన్ స్టార్ట్‌ చేసిన విజయ్‌ దేవరకొండ.. నేనున్నా అంటున్న డైరెక్టర్‌!

6 25
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధులకి భారీగా విరాళాలను అందజేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్న హీరో విజయ్ దేవరకొండ తాజాగా కోటి ముప్ఫై లక్షల విరాళం ప్రకటించారు.

ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి డి ఎఫ్), మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎం సి ఎఫ్) అనే రెండు ఛారిటీ విభాగాలను విజయ్ దేవరకొండ స్టార్ట్ చేశారు.ఈ ఫౌండేషన్స్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించనున్నానని విజయ్ పేర్కొన్నారు. విజయ్ తన జీవితంలో కనీసం ఒక లక్ష మందికి ఉద్యోగులను తయారు చేయాలని అనుకుంటున్నారు తెలిపారు. అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఆదుకునేందుకు విజయ్ ఈ ఫౌండేషన్ ముఖ్య ద్యేయం కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారికి సాయం చేయడమని విజయ్ దేవరకొండ తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

6a 1ఈ నిర్ణయంపై డైరెక్టర్‌ కొరటాల శివ విజయ్ దేవరకొండ పై ప్రసంశలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ” లవ్ యూ బ్రదర్ పదిమందికి తోడుగా ఉండే పనిలో నీకు తోడుగా నేనుంటా కుమ్మేదాం ..మంచితో సీయూ సూన్ ” అంటూ ట్వీట్ చేశారు కొరటాల. కాగా ది రియల్‌ మెన్‌ ఛాలెంజ్‌ని కూడా కొరటాల విజయ్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే.. దానితో త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu