బుల్లితెర నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఫేస్బుక్ ద్వారా ఆమెకు పరిచయమైన కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడు చిత్ర పరిశ్రమలో నిర్మాత అని తెలిసింది. ‘కారులో వెళ్తున్న సింగ్ కేఫ్ సమీపంలో ఉన్న నటిని అడ్డగించాడు. తనను ఎందుకు దూరం పెట్టావని, ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సింగ్ నటి పొట్ట భాగంలో, చేతులపై కత్తితో దాడి చేసి, పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మాల్వీ ‘ఉడాన్’, ‘హోటెల్ మిలాన్’ టీవీ షోలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం కోకిలబెన్ అంబానీ ఆసుపత్రితో ఆమెకు చికిత్స జరుగుతోంది. ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం)తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం’ అని వెర్సోవా పోలీసు స్టేషన్కు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అతడు తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, కానీ దానికి తిరస్కరించానని పేర్కొన్నారు.