నేచురల్ స్టార్ నాని కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీష్’. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో తిరిగి షూటింగ్ ప్రారంభమైన టక్ జగదీష్ చిత్ర యూనిట్లో ఒకరికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారని, టీమ్ మొత్తం ఐసొలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ డైరెక్టర్ శివ నిర్వాణ ఓ వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశారు. ”అన్ స్టాపబుల్.. #టక్ జగదీష్ సెట్స్ లో 38వ రోజు” అని ట్వీట్ చేస్తూ ఓ వీడియోను జత చేశాడు. ఈ వీడియోద్వారా చిత్రబృందం షూటింగ్ జరుపుతున్నట్లు క్లారిటీ వస్తోంది. ఇక రూమర్లకు చెక్ పడినట్టే చెప్పొచ్చు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ రొమాన్స్ చేయబోతున్నారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శివ నిర్వాణకు డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే మంచి బ్రేక్ వచ్చింది. మరోసారి ఈ క్రేజీ కాంబోలో వస్తున్న టక్ జగదీష్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.