కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలోని ప్రముఖ దేవాలయాలు సైతం భక్తుల దర్శనాన్ని నిలిపివేశాయి. అయితే, కరోనాను ఎదుర్కొనడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.19 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది.
దీంతో పాటుగా టీటీడీ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఓ ఆయుర్వేద మెడిసిన్ ను తయారు చేశారు. క్రిమి సంహార ధూపం, చేతులను శుభ్రం చేసుకొనే ద్రావకం, పుక్కిలించే మందు, నింబనశ్యము, అమృత అనే మందులను తయారు చేసింది. వీటిని వాడటం వలన కరోనా నుంచి రక్షణ పొందొచ్చని టీటీడీ ఆరుర్వేద కళాశాల పేర్కొన్నది.