Squid Game 2 with Indian Celebrity Cast:
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న Squid Game 2 సిరీస్, డిసెంబర్ 26, 2024న విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 91 రోజుల్లో 265.2 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ సిరీస్ అనేక దేశాల్లో టాప్ షోగా నిలిచింది. అయితే ఈ సీజన్‌ను కేవలం కంటెంట్‌గానే కాదు, ఇప్పుడు AI క్రియేషన్స్‌తో కూడా ఆసక్తికరంగా మార్చేశారు.
ఇండియన్ సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సౌత్ స్టార్స్ అయిన రజనీకాంత్, కమల్ హాసన్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, మమ్ముట్టి, ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులను స్క్విడ్ గేమ్ కాంటెస్టెంట్లుగా చూపించారు.
View this post on Instagram
వీరు అందరూ ఆ ఐకానిక్ గ్రీన్ ట్రాక్సూట్స్ ధరించి స్క్విడ్ గేమ్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, జానీ లివర్ కూడా ఈ వీడియోలో కనిపించడం అభిమానులను మరింత ఎగ్జైట్ చేసింది. ఈ వీడియోలో హీరోలను “వైల్డ్ కార్డ్ ఎంట్రీస్”గా చూపిస్తూ, వాళ్లు ఎలా ఆ డెడ్‌లీ ఛాలెంజ్‌లను ఫేస్ చేస్తారో చూపించారు.
ఇది కేవలం వినోదమే కాదు, AI టెక్నాలజీ ఎంత కొత్తగా ఎంటర్‌టైన్ చేయగలదో కూడా ఈ వీడియో చూపిస్తోంది. ఇండియన్ సినిమాకు, స్క్విడ్ గేమ్ సిరీస్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్ ఈ వీడియో వల్ల స్పష్టమవుతోంది.
అదే సమయంలో, స్క్విడ్ గేమ్ 2 సిరీస్ ఇంకా ట్రెండింగ్‌లో ఉంది. కొత్త సీజన్ ముగింపులో స్క్విడ్ గేమ్ 3 వచ్చే అవకాశాలను కూడా టీజ్ చేశారు. ఇక రెడ్ లైట్… గ్రీన్ లైట్ గేమ్ కోసం కొత్త డాల్‌ను చేర్చడం అభిమానుల్లో మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
ALSO READ: Sankranthiki Vastunnam సినిమా ఈ హీరో చేయాల్సిందట! ఎవరో తెలుసా?