IC 814 Kandahar Hijack:
అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ IC 814 Kandahar Hijack సరికొత్త వివాదాలకు దారి తీసింది. ఈ సిరీస్ ఆగస్టు 29న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. 1999 డిసెంబరులో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్‌పై ఆధారపడి రూపొందిన ఈ సిరీస్‌లో హైజాకర్స్ పేర్లను మార్చి హిందూ పేర్లుగా ఉంచారనే విమర్శలు సోషల్ మీడియా వేదికగా వినిపించాయి.
1999 డిసెంబరులో నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814ను కిడ్నాప్ చేసి, పలు ప్రదేశాల్లో ల్యాండ్ చేయించి చివరకు తాలిబన్ల నియంత్రణలో ఉన్న కాందహార్, ఆఫ్ఘానిస్తాన్‌కు తీసుకెళ్లారు.
సిరీస్‌లో హైజాకర్లు చీఫ్, డాక్టర్, బర్గర్, భోళా, శంకర్ అనే పేర్లతో పిలుచుకుంటారు. అయితే చాలామంది భోళా, శంకర్ పేర్లను హైజాకర్ల అసలు పేర్లను మార్చినట్లుగా విమర్శించారు. అనుభవ్ సిన్హా సిరీస్‌లో వాస్తవాలను వక్రీకరించారని, మతభావాల్ని ద్రవమింపజేయాలని ప్రయతిస్తున్నారు అని కొందరు ఆరోపించారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2000 జనవరి 6 నాటి ప్రకటన ప్రకారం హైజాకర్ల పేర్లు
ఇబ్రహీం ఆథర్ బహవల్‌పూర్,
షాహిద్ అక్తర్ సయీద్, గుల్షన్ ఇక్బాల్, కరాచీ,
సన్నీ అహ్మద్ కాజి, డిఫెన్స్ ఏరియా, కరాచీ
మిస్ట్రి జహూర్ ఇబ్రహీం, అక్తర్ కాలనీ, కరాచీ
షకీర్, సుక్కర్ సిటీ
విమానంలో ప్రయాణికులకు మాత్రం ఈ హైజాకర్లు కోడ్ పేర్లను చెప్పారు. అవి చీఫ్, డాక్టర్, బర్గర్, భోళా, శంకర్. కాబట్టి, భోళా, శంకర్ పేర్లు హిందూ పేర్లు అయినా కూడా.. అవి హైజాక్ సమయంలో వాళ్ళు వాడిన కోడ్ పేర్లు అని తెలుస్తోంది.
ఈ సిరీస్ ప్రముఖ జర్నలిస్టు శ్రీనజోయ్ చౌధురి, IC 814 విమానం కెప్టెన్ దేవి శరణ్ కలిసి రాసిన పుస్తకం ఫ్లైట్ ఇన్‌టూ ఫియర్: ది కెప్టెన్‌స్ స్టోరీ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.
ఈ సిరీస్‌లో విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, మనోజ్ పావా, అరవింద్ స్వామి, అనుపమ్ త్రిపాఠి, దియా మీర్జా, పత్రలేఖా, అమృత పూరి, దిబ్యేంద్ర భట్టాచార్య, కుముద్ మిశ్రా ముఖ్య పాత్రల్లో నటించారు.