తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని సినీనటుడు, ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో ఆలయ అర్చకులు, సిబ్బందికి ఈరోజు ఆయన వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మోహన్‌బాబు తమ్ముడూ అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మళ్లీ మీరే గెలవాలని కోరుకుంటున్నా అంటూ తుమ్మలతో చెప్పారు. అనంతరం ఆలయ సిబ్బంది, అర్చకుల తరపున స్వరూపానందేంద్ర స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యకమంలో ఆలయ కమిటీ సభ్యులు పరుచూరి గోపాలకృష్ణ, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.